- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pragya Jaiswal: బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాస్తున్నాను.. దయచేసి క్షమించండంటూ ప్రగ్యా ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘కంచె’చిత్రంలో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘కంచె’చిత్రంలో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక బాలయ్య సరసన అఖండ చిత్రంలో నటించిన ఈ భామ హిట్ అందుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇక ఇటీవల ప్రగ్యా మరోసారి బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’(Daaku Maharaj) సినిమాలో నటించి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘అఖండ-2’(Akhanda-2) మూవీలో నటిస్తున్నట్లు సమాచారం. ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ (Balakrishna)తో రొమాన్స్ చేయనుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ప్రగ్యా నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా, ఈ భామ పహల్గాం ఉగ్రదాడి సంఘన గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. ‘‘మంచుతో కప్పబడి శిఖరాలు, యాపిల్ తోటలు, కుంకుమ పొలాల లోయలో ప్రపంచం స్వరం అని పిలుస్తున్న ప్రదేశంలో పెరిగిన వ్యక్తిగా నేను బరువెక్కిన హృదయంతో వ్రాస్తున్నాను. కానీ ఈ రోజు నా స్వర్గం గాయపడినట్లు అనిపిస్తుంది. మరోసారి మేము ప్రార్ధిస్తున్నాం. శాంతి తెలివిలేని హింస ద్వారా చిద్రమైంది. ఈసారి ద్వేషంతో కాదు ఉత్సుకతతో, ప్రేమతో ఆశ్చర్యంతో ఇక్కడికి వచ్చిన అమాయక పర్యాటకులకు వ్యతిరేకంగా నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు ఇప్పుడు నా మాతృభూమిలో అడుగు పెట్టడానికి భయపడుతున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్తున్నాను.
లోతుగా భరించలేనంతగా క్షమించండి. ఈ దాడులు మేం కాదు.. మేము అతిథ్యం, వెచ్చదనం స్థిప్థాపకతతో దు:ఖిస్తున్నాము. మీపై ఎవరు చేతులెత్తినా అది కాశ్మీర్ ఆత్మకు వ్యతిరేకంగా ఉంది. మేమ మీతో ఏడుస్తాము. కోల్పోయిన వారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మీరు తిరికి రావడానికి పోరాడుతూనే ఉంటాము. ఆశతో ఇప్పటికీ వైద్యం మీద నమ్మకం ఉన్న కాశ్మీరీ’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






