హీరో ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్‌లో కుర్ర హీరోయిన్

by Sujitha Rachapalli |

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్‌గా సత్తాచాటాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ మధ్య వచ్చిన ‘డ్యూడ్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన.. ఫిబ్రవరిలో #LIK సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్

హీరో ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్‌లో కుర్ర హీరోయిన్
X

దిశ, సినిమా : యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్‌గా సత్తాచాటాడు. నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ మధ్య వచ్చిన ‘డ్యూడ్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన.. ఫిబ్రవరిలో #LIK సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రాబోతున్న సినిమా సైన్స్ ఫిక్షన్‌గా ఉండబోతుందని.. విజువల్లీ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఇప్పటికే తెలుగుతోపాటు హిందీ ఇండస్ట్రీలో ఆఫర్లు అందుకుంటున్న బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికారిక ప్రకటన లేకుండానే ఈ సినిమా ట్రెండ్ అవుతుండగా.. ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగా ఫోన్ పట్టడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన చిత్రాల్లో హీరోయిన్స్ సెలెక్షన్ అదిరిపోతుందనే కామెంట్స్ కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం.

Next Story