- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: రిలీజ్ కు ముందే 'స్పిరిట్' బ్లాక్ బాస్టర్ రికార్డ్..!
డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో కలిపి ఏకంగా 160 కోట్ల రూపాయల రికార్డు ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. ముందే భారీ

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని, ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛత్రపతి, బాహుబలి, లాంటి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు చేసి, పాన్ ఇండియా స్టార్ట్ హీరోగా ఎదిగాడు. అలాంటి ప్రభాస్, ప్రస్తుతం సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ( Spirit ) చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.
అయితే ఈ మూవీ రిలీజ్ కాకముందే, సరికొత్త రికార్డు సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో కలిపి ఏకంగా 160 కోట్ల రూపాయల రికార్డు ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ముందే భారీ డీలర్ జరిగిందన్న వార్తలు మూవీపై మరింత క్రేజ్‌ను పెంచేస్తున్నాయి. మరి డిజిటల్ హక్కులే ఈ రేంజ్ లో పలికితే, సినిమా రిలీజ్ అయితే మాత్రం థియేటర్లు కిక్కిరిసి పోవడం గ్యారంటీ అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తుండగా తృప్తి డిమ్రి హీరోయిన్ గా మెరువనున్నారు. వివేక్ ఒబెరాయ్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడట. కాగా ఈ సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా ( Spirit ) 2027 లో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.






