- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త చిక్కులు..ఆగిపోయిన స్పిరిట్ షూటింగ్ ?
కల్కి 2898 AD ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఇటీవల కాలంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇంతలోనే స్పిరిట్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు ప్రభాస్. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. బాహుబలి ది ఎపిక్ స్పెషల్ షో కోసం రెబల్ స్టార్ ప్రభాస్...జపాన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 5 అంటే రేపు, ఎల్లుండి జరిగే ప్రీమియర్స్ కు ప్రభాస్ హాజరవుతారని తెలుస్తోంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది. అదే సమయంలో కల్కి 2898 AD ప్రమోషన్ల సమయంలో జపాన్ అభిమానులను కలవలేకపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఆ సినిమా సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వారిని ఈసారి కలవబోతున్నారట ప్రభాస్. ఈ రెండు కారణాల నేపథ్యంలో స్పిరిట్ సినిమాకు కొత్త చిక్కులు వచ్చినట్లు చెబుతున్నారు. స్పిరిట్ సినిమా షూటింగుకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ప్రభాస్ లేని సీన్స్ ఈ గ్యాప్ లో ఫినిష్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి నటించనున్నారు.






