- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘శంబాల’ ట్రైలర్.. వణుకు పుట్టిస్తున్న విజువల్స్
వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’.

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’. ‘ఎ మిస్టికల్ వరల్డ్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో భాగంగానే ప్రేక్షకుల్లో మరంత హైప్ పెంచేస్తూ.. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
‘కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఓ భీకర యుద్దం.. ఈ కథకి మూలం’ అంటూ సాయి కుమార్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. ‘అగ్ని పురాణం ప్రకారం ఆకాశంలో సంగ్రామం జరిగినప్పుడు దుష్ట శక్తులు జంతువుల్ని సైతం ఆవహిస్తాయి’.. ‘మీరు చెబుతున్న శాస్త్రం మితం.. మీరు తెలుసుకోవాల్సిన మా శాస్త్రం అనంతం’ అనే డైలాగ్స్, విజువల్స్, బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఆది సాయి కుమార్ యాక్షన్, అప్పియరెన్స్ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఆడియెన్స్ ముందుకు రానుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక మూవీని భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే.






