- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ - రాజమౌళి అలాంటి వారు... షాకింగ్ కామెంట్స్ చేసిన జగపతిబాబు
జగపతిబాబు మాట్లాడుతూ… కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభాస్ తనకు సహాయం చేశాడని తెలిపారు. అలాగే రాజమౌళి ఎంత ఎదిగినా ఎంతో వినయంగా ఉంటాడని ఆయన పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో జగపతిబాబు ఒకరు. హీరోగా అనేక సంవత్సరాలు కొనసాగిన ఆయన ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా కొత్త ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో విలన్ పాత్రలతో పాటు కీలక పాత్రల్లో నటిస్తూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాస్, రాజమౌళి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగపతిబాబు మాట్లాడుతూ, “కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను.
అలాంటి సమయంలో ఎందుకో ప్రభాస్ గుర్తుకొచ్చాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేశాను. ఆ సమయంలో ఆయన విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు. ‘ఇండియాకు వచ్చాక తప్పకుండా కలుస్తాను సార్’ అని చెప్పారు. నేను ఆయన బిజీ షెడ్యూల్‌లో మర్చిపోతారేమో అనుకున్నాను. కానీ షూటింగ్ పూర్తయ్యాక ఇండియాకు వచ్చిన వెంటనే నన్ను కలిశారు. నా సమస్యలను తెలుసుకొని నాకు సహాయం చేశారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ నన్ను గుర్తుంచుకొని కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
అలాగే రాజమౌళి గురించి మాట్లాడుతూ, “ఆయన ఫ్యామిలీ ఆయనకు పెద్ద బలం. వారంతా కలిసిమెలిసి ఉంటారు. వెకేషన్‌కు వెళ్లినా కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. వారి డెడికేషన్ కనీసం 20% అందరికీ ఉన్నా కూడా ప్రతి సినిమా హిట్ అవుతుంది. రాజమౌళి ఎన్నో విజయాలు సాధించినా ఎప్పుడూ వినయంగా, సాదాసీదాగా ఉంటారు. ఆయన కుటుంబంలో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ, అవసరం లేని పాత్రల్లో వారిని పెట్టరు. పాత్రకు సరిపోయే వారినే ఎంపిక చేస్తారు. అందుకే ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు” అని జగపతిబాబు పేర్కొన్నారు.
‘జైలర్-2’ చాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఈ సినిమా ఆయనకు అంకితం అంటూ ఎమోషనల్ పోస్ట్






