ప్రభాస్ పేరుతో ఫేక్ కాల్స్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీ ఆవేదన..వీడియో వైరల్!

by velandi.Saikiran |

ఫిష్ వెంకట్ ( Fish Venkat) గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా.. చిన్నపాటి విలన్ గా

ప్రభాస్ పేరుతో ఫేక్ కాల్స్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీ ఆవేదన..వీడియో వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: ఫిష్ వెంకట్ ( Fish Venkat) గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా.. చిన్నపాటి విలన్ గా కూడా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాడు. అయితే అలాంటి ఫిష్ వెంకట్ ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నారు. హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆపరేషన్ చేయాలంటే దాదాపు 50 లక్షల రూపాయలు అవసరమని అంటున్నారు ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు. ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ నుంచి ఆర్థిక సహాయం అందనుందని నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి.

ఈ మేరకు ఫిష్ వెంకట్ ఫ్యామిలీ సభ్యులు కూడా ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు అదంతా ఫేక్ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ప్రభాస్ (Prabhas) PA అని ఫేక్ కాల్స్ చేస్తున్నారని.. ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అవుతున్నారు. ప్రభాస్ PA అని ఒకరు ఫేక్ కాల్ చేశారని.. వీడియో ద్వారా పేర్కొన్నారు. ఫేక్ కాల్ చేసి... మా నాన్న ఫిష్ వెంకట్ గురించి వివరాలు తెలుసుకొని సహాయం చేస్తానని నిన్న ఒక వ్యక్తి ఫోన్ చేసినట్లు ఫిష్ వెంకట్ కూతురు వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని తాజాగా పేర్కొన్నారు.

తమకు వచ్చిన నెంబర్ కు మళ్ళీ కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయడం లేదని కూడా ఫిష్ వెంకట్ కూతురు ఎమోషనల్ అయ్యారు. ఇలా ఫేక్ కాల్స్ తో కాలయాపన చేయకుండా నిజంగా సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే.. తొందరగా చేయండి అని వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్స్.. ఇప్పటికైనా ప్రభాస్ స్పందించాలని... ఫిష్ వెంకట్ కు సహాయం చేయాలని కోరుతున్నారు.

Twitter Link

Next Story