ప్రభాస్ క్రేజీ లుక్ వైరల్.. ఆ సినిమా కోసం భారీ ప్లాన్‌!

by velandi.Saikiran |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త మేకోవర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Prabhas latest Looks goes viral
X

Prabhas latest Looks goes viral

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకు ఉంచుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈశ్వర్, రాఘవేంద్ర లాంటి చిన్న చిన్న సినిమాలు చేసి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లారు. ఇక ఇప్పుడు ప్రభాస్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతోంది. అయితే అలాంటి ప్రభాస్ తాజాగా కొత్త లుక్స్ లో కనిపించాడు.

న్యూ లుక్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త గెటప్ లో కనిపించాడు. సరికొత్త మేకోవర్ తో మెరిసిన ప్రభాస్ , సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కపుల్ ఫ్రెండ్లీ టీమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. పక్కగా సెట్ చేసిన హెయిర్ స్టైల్, గడ్డం, ట్రెండీ డ్రెస్సింగ్ లో ప్రభాస్ మునుపటి గ్లామర్ ను గుర్తు చేస్తూ సందడి చేస్తున్నారు. మిర్చి సినిమాలో ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రభాస్ కొత్త లుక్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే ఈ లుక్స్ లో ప్రభాస్ కనిపించాడని అంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవము ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్. కాగా ఇటీవల మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేశారు. ఈ సినిమా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. కథ కొత్తది అయినప్పటికీ దర్శకత్వ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో సినిమా తేలిపోయింది.

Next Story