- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ బ్యూటీ.. రియల్ హీరోయిన్ అనిపించుకున్నావంటూ నెట్టింట ప్రశంసల జల్లు(వీడియో)
‘ఝుమ్మంది నాదం’(jhummandi Naadam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఝుమ్మంది నాదం’(jhummandi Naadam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను(Taapsee Pannu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కానీ, ఈ అమ్మడుకు అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మెప్పిస్తోంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు తన ప్రియుడు మథియాస్(Mathiyas)తో ప్రేమలో పడి.. గత ఏడాది మార్చి 23న పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా, తాప్సీ గొప్ప మనసు చాటుకుంది. ఎండలు పెరిగిపోవడంతో జనాలు ముఖ్యంగా పేద ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారని ఆలోచించి వారికి ఈ బ్యూటీ సహాయం అందించింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డులో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. భర్త మథియాస్ బోతో కలిసి పేదలకు ఫ్యాన్స్, కూలర్లు అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు తాప్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరోయిన్ అనిపించుకున్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.






