ప్రభాస్ బ్యూటీ లేటెస్ట్ ఫొటో షూట్.. మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్

by I. Sairam |

అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రభాస్ బ్యూటీ లేటెస్ట్ ఫొటో షూట్.. మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అలా ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఓ పక్కా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో కిర్రాక్ అనిపించింది. హెయిర్ లీవ్ చేసిన ఫొటోలు చూస్తే ఎవ్వరికైనా భువి నుండి దిగివచ్చిన దేవకన్య కాబోలు అన్నంతగా అందంగా కనిపించింది. ఇక ఈ పిక్స్‌కు ‘సో.. థగ్ లైఫ్ ప్రొమోషన్స్ కోసం ఇలా రెడీ అయ్యాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మేడం సార్ మేడం అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story