హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ.. ది ఐ సినిమా ట్రైలర్ చూశారా..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-28 07:25:30  IST  )

టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ బ్యూటీ.. ది ఐ సినిమా ట్రైలర్ చూశారా..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అలా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్(allu Arjun), రామ్ చరణ్(Ram Charan), ప్రభాస్(Prabhas), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు రజనీకాంత్(Rajinikanth) ‘కూలీ’(Coolie) మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే విజయ్(Vijay) చివరి సినిమా ‘జన నాయగన్‌’(Jana Nayagan)లోనూ నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ బ్యూటీ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. శృతి హాసన్, మార్క్ రౌలీ జంటగా ‘ది ఐ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ కంటెంట్ బ్యానర్ పై డ్యాఫెన్ స్కమన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.

అయితే ఈ సినిమా నేడు ముంబై వెంచ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. కాగా త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే మరణం అనేది జీవితానికి ఎండ్ కాదు అనే కొటేషన్ తో ది ఐ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. శృతి హాసన్ పార్ట్నర్ పాత్ర మరణిస్తే ఏం జరిగింది అన్నట్టు కథాంశం ఉండబోతుంది. సినిమాలో శృతి బోల్డ్‌గా కూడా నటించినట్టు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ది ఐ ట్రైలర్ చూసేయండి.

Next Story