- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
చిత్ర పరిశ్రమ(Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమ(Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సతీష్ షా(74) కన్నుమూశారు. కిడ్నీ ఫెయిలై కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నిర్మాత అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సతీష్ షా(Satish Shah) మరణవార్త తెలిసిన ఇండస్ట్రీ ప్రముఖులు, బంధువులు సంతాపం ప్రకటిస్తున్నారు. సుమారు 40 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో రాణించారు. సినిమాల్లో, టీవీ సీరియల్లలో అలరించారు. ‘సారభాయ్ వర్సెస్ సారభాయ్’ అనే టీవీ షోతో సతీష్ షా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సారభాయ్ వర్సెస్ సారభాయ్’లో ఇంద్రవదన్ శరభాయ్‌గా ఆయన నటించారు. ఈ పాత్ర ఇండియన్ టీవీ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ హాస్య పాత్రలలో ఒకటిగా నిలిచింది. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ వంటి హిట్ సినిమాల్లో హాస్య నటుడిగా నటించారు. పలు చిత్రాల్లో యాక్టింగ్‌కు అవార్డులు కూడా వచ్చాయి. ట్వీట్






