- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూజా హెగ్డేను కాపాడేందుకు రంగంలోకి మెగా హీరో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ పూజా హెగ్డేకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఇండస్ట్రీలో

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ పూజా హెగ్డేకు ఉన్న ఫాలోయింగ్ అంతా కాదు. ఇండస్ట్రీలో దాదాపు 12 సంవత్సరాలుగా రాణిస్తున్నారు పూజా హెగ్డే. తెలుగులో ఒక లైలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. రంగస్థలం లాంటి సినిమాలో జిగేలు రాణి అంటూ స్టెప్పులు వేసింది పూజా హెగ్డే.
అలాంటి పూజ హెగ్డే కెరీర్ ప్రస్తుతం... అస్తవ్యస్తంగా తయారయింది. ఆచార్య తర్వాత తెలుగులో మెయిన్ హీరోయిన్ గా అవకాశమే రాలేదు. గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చినప్పటికీ.. మధ్యలోనే ఆమెను.. తొలగించారు. ఇక.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు పూజా. ఇది ఇలా ఉండగా... తాజాగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు హీరోయిన్ పూజా హెగ్డే.
వీరిద్దరి కాంబినేషన్ లో అలా వైకుంఠపురం అలాగే డీజే సినిమాలు వచ్చాయి. డీజే సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను గుర్తు చేస్తూ ఆసక్తికర పోస్టు పెట్టింది హీరోయిన్ పూజ హెగ్డే. మళ్లీ డీజే రీ యూనియన్ కు ఛాన్స్ ఉందా...? ఎక్కడున్నావ్ అల్లు అర్జున్ అంటూ బన్నీని ట్యాగ్ చేసింది పూజా హెగ్డే. ఇక ఈ పోస్ట్ చూడగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. కష్టాల్లో ఉన్న పూజా హెగ్డే కు ఒక ఛాన్స్ ఇవ్వు అంటూ అల్లు అర్జున్ ను కోరుతున్నారు.






