- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తిరిగి వెళ్లే సమస్యే లేదు’.. పొలిటికల్ డైలాగ్స్‌తో దళపతి సినిమా ట్రైలర్ (వీడియో)
దళపతి విజయ్ప్ర ధాన పాత్రలో వస్తోన్న జన నాయకుడు చిత్ర ట్రైలర్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రధాన పాత్రలో వస్తోన్న జన నాయకుడు చిత్ర ట్రైలర్(Jana Nayakudu Trailer) విడుదలైంది. ఫుల్ యాక్షన్ మోడ్‌లో దళపతి చెలరేగిపోయారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యువ నటి మమితబైజు, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది.
అయితే.. ఈ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘అర్హత లేని వాళ్లంతా ఒకవైపు నిల్చున్నారు.. వాళ్లను తప్పకుండా ఓడించి తీరాలి’’ అంటూ ఒకటి. ‘‘నిన్ను నాశనం చేస్తాం.. అవమానిస్తాం అని ఎవరు చెప్పినా సరే.. తిరిగి వెళ్లే ఐడియానే లేదంటూ మరొకటి.. ఐయామ్ కమింగ్ అంటూ ఇంకోటి’’.. ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే.. హత్యలు చేయడానికి, దోపిడీలు చేయడానికి వస్తార్రా’’ అంటూ దళపతి చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి.






