- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Upasana Konidela: దయచేసి సాయం చేయండంటూ ఫోన్ నంబర్ పెట్టిన మెగా కోడలు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

దిశ, సినిమా: రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె గత కొద్ది కాలంగా అపోలో హస్పిటల్ బాధ్యతలు తీసుకుని ఆపదలో ఉన్నవారికి ఫ్రీగా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తోంది. ఇక ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా వివాహం జరిగిన 11ఏళ్ల తర్వాత ఓ పాప కూడా ఉంది. అయితే 2023లో ఉపాసన, రామ్ చరణ్ తల్లితండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఆ పాపకు క్లిన్ కారా(klin kara) అనే పేరు పెట్టారు. కానీ ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ఫేస్‌ను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ముఖం చూపించకపోవడంతో మెగా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.
పదే పదే సోషల్ మీడియాలో పలు మెసేజ్‌లు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ పాప ఫేస్ రివీల్ చేయకపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె చేసే పోస్టులు ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆమె తన సిస్టర్స్‌తో కుంభమేళాకు కూడా వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన సాయం కోరుతూ ఇన్‌స్టా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘జూబ్లిహిల్స్ ఏరియాలో రోడ్ నెంబర్ 25లో ఓ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ మిస్ అయింది. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తెలియజేయండి.
గ్రే కలర్, తోక మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. దానిని చిట్టి అని పిలిస్తే రెస్పాండ్ అవుతుంది. కనిపిస్తే చెప్పండి ఈ నంబర్‌కు కాల్ చేయండి. దయచేసి కనిపించిన వెంటనే 7337422195 ఫోన్ చేయండి. ప్లీజ్ సాయం చేయండి చిట్టిని కనిపెట్టండి’’ అని రాసుకొచ్చింది. అలాగే ఆ ప్యారెట్ ఫొటోలను కూడా షేర్ చేసింది.చూస్తుంటే ఇది వారి ఇంటి నుంచే మిస్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక తన పెంపుడు జంతువు మిస్ అవడంతో మెగా కోడలు దుఖంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు దానిని వెతికే పనిలో పడ్డారు.