దయచేసి నన్ను అలా పిలవకండి.. కంఫర్ట్‌గా ఉండలేనంటూ లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్(పోస్ట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-05 13:20:20  IST  )

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’(Laxmi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దయచేసి నన్ను అలా పిలవకండి.. కంఫర్ట్‌గా ఉండలేనంటూ లేడీ సూపర్ స్టార్ షాకింగ్ కామెంట్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’(Laxmi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ఎన్నో మంచి విజయాలు సాధించిన చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఈ భామ రీసెంట్‌గా ‘జవాన్’(Jawan) మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ అమ్మడు రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) మూవీలో నటిస్తుంది. యష్‌కు అక్కగా ఈ బ్యూటీ అలరించనుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ విగ్నేష్ శివన్‌(Vignesh Shivan)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత స్వరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం ఓ పక్కా సినిమాలు మరో పక్కా ఫ్యామిలీతో లైఫ్‌ను లీడ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నయనతార ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘మీరు చూపే అభిమానికి కృతజ్ఞురాలిని. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌లో, కష్ట సమయంలో మీరు అండగా ఉన్నారు.

మీరెంతో ప్రేమతో ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ బిరుదుకు నేను రుణపడి ఉంటా. కానీ నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందం. లేడీ సూపర్ స్టార్ లాంటి బిరుదులు వెలకట్టలేనివి. అయితే, వాటివల్ల కంఫర్ట్‌గా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దాన్ని ఎప్పూడూ సెలబ్రేట్ చేసుకుందాం’ అని నోట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story