- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి: రాశీ ఖన్నా
దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. సన్నగా మారడం కంటే మీ శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన వర్కవుట్ మాత్రం మానలేదని వెల్లడించింది. తన సోషల్ మీడియా ద్వారా ఫిట్‌నెస్ సీక్రెట్స్ గురించి, మానసిక ప్రశాంతత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తనకు వర్కవుట్ చేయడం అనేది ఒక థెరపీ లాంటిదని, అది తన జీవితంలో ఉన్న నెగటివిటీని దూరం చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని వెల్లడించింది. సమయం గడుస్తున్న కొద్దీ ఫిట్‌నెస్ పట్ల తనకున్న ఆలోచన పూర్తిగా మారిపోయిందని రాశీ ఖన్నా అంగీకరించింది. "వర్కవుట్స్ చేయడం వల్ల నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను వర్కవుట్ చేయకపోతే, నా జీవితంలో నెగటివిటీ మొత్తం నాలోనే పేరుకుపోతుందని నేను భావిస్తాను.
ఫిట్‌నెస్ అనేది ఒక పరిపూర్ణమైన ప్రయాణం. ఇది కేవలం మీ లుక్స్‌ను మాత్రమే కాకుండా, మీ ఆలోచనా విధానాన్ని, మీరు ప్రతిరోజూ ఎలా ఫీల్ అవుతున్నారనే దాన్ని కూడా మారుస్తుంది" అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా ముఖ్యంగా అమ్మాయిలకు ఒక మంచి సలహా ఇచ్చింది. వేరొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం ఆపేయాలని కోరింది. "ప్రతి ఒక్కరి శరీరం చాలా ప్రత్యేకం. నా ఫిట్‌నెస్ ప్రయాణం మొదట్లో నేను కూడా కేవలం సన్నగా అవ్వాలనే అనుకున్నాను. అది నేను చేసిన ఒక పెద్ద తప్పు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్స్‌ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. సన్నగా మారడం కంటే మీ శరీరాన్ని బలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. రోజుకో చిన్న అడుగు వేస్తూ ఏదో ఒక శారీరక శ్రమను అలవాటు చేసుకోండి" అని రాశీ సూచించింది.






