బాలీవుడ్‌లో దూసుకుపోతున్న పీపుల్ మీడియా.. ఆ స్టార్ హీరోతో ఏకంగా రెండు సినిమాలు

by Chukka Sudharani |

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం

బాలీవుడ్‌లో దూసుకుపోతున్న పీపుల్ మీడియా.. ఆ స్టార్ హీరోతో ఏకంగా రెండు సినిమాలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన హవా కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర తెలుగు స్టార్లతో కలిసి పనిచేసిన తర్వాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి తన మార్క్‌ను సెట్ చేసుకునేందుకు బలంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు ఈ నిర్మాణ సంస్థ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో రెండు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. టైగర్‌కు ఉన్న యాక్షన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ రెండు ప్రాజెక్టులు రూపొందించబోతుండగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story