- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృషి ఉంటే మనుషులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు - పవన్ కళ్యాణ్ పై కృష్ణ భగవాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్(వీడియో)
స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్(Krishna Bhagwan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్(Krishna Bhagwan) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్ అండ్ పంచులతో అలరించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరం అయిన ఆయన రీసెంట్‌గా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోకు జడ్జిగా వచ్చాడు. అక్కడ కూడా కంటెస్టెంట్స్ కంటే కూడా ఎక్కువ పంచులు వేసి ఫుల్‌గా నవ్వించాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణ భగవాన్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా ఫీల్డ్ అంటే హాయిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ వ్యక్తి ఎండన తిరిగి, మాటలు పడి, కష్టే ఫలి అని నమ్మి పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు. జనంలోకి వెళ్లాడు.. అందుకే కృషి ఉంటే మనుషులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. అతను అన్ని గుర్తు పెట్టుకున్నాడు. నాతో కూడా చాలా బాగా మాట్లాడుతాడు. హీరో, డిప్యూటీ సీఎం అనే భావన లేకుండా ఒక మంచి మనిషిలా బిహేవ్ చేస్తాడు’ అని పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కృష్ణ భగవాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






