Peddi Second Single : పెద్ది సెకండ్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది

by Pulgam srinivas |   (  Updated:2026-02-26 12:22:12  IST  )

పెద్ది మూవీలోని 'రై రై రా రా' అంటూ సాగే రెండవ పాటను మార్చి 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Peddi Second Single : పెద్ది సెకండ్ సింగిల్ విడుదల తేదీ వచ్చేసింది
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చాలా కాలం క్రితమే ఈ సినిమా నుండి చికిరి చికిరి అనే సాంగ్ను విడుదల చేశారు. అది అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. రై రై రారా అంటూ సాగే ఈ మూవీలోని రెండవ సాంగ్ను మార్చి 2వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వృద్ధి సినిమాస్, మైత్రి సంస్థ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యాంధు తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Next Story