Peddi: 'డాల్బీ'లో పెద్ది.. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్

by Pulgam srinivas |

పెద్ది చిత్రాన్ని 'డాల్బీ'లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

Peddi: డాల్బీలో పెద్ది.. సౌండ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుండి వచ్చిన చిత్రం కావడంతో ఆయన అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఏప్రిల్ 30న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన అన్ని ప్రచార చిత్రాలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని చరణ్ కెరియర్లోనే మంచి స్థానంలో నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ చిత్రం నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ యూనిట్ పెద్ది చిత్రాన్ని 'డాల్బీ' సౌండింగ్ తో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

'డాల్బీ' సౌండ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది, దానితో ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు బాగుండడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నట్లయితే దానికి 'డాల్బీ' సౌండ్ జత అయితే సినిమాను అది మరో స్థాయికి తీసుకు వెళుతుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యాంధు, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

Next Story