- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Peddi: అదే జరిగితే ఇండియాలోనే బిగ్గెస్ట్ నెంబర్ గా నిలవనున్న పెద్ది
పెద్ది చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే, మృనాల్ ఠాకూర్, అయేషా ఖాన్ నటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజం అయితే ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ ఐటెం నెంబర్ అయ్యే అవకాశాలున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని మొదట మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ చిత్ర విడుదల తేదీని ఏప్రిల్ 30వ తేదీకి మార్చారు. ప్రస్తుతం అందుకు అనుగుణంగా చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక అదిరిపోయే రేంజ్ ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు, అందులో తమన్నా నటించే అవకాశాలు ఉన్నట్లు చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీలోని ప్రత్యేక గీతానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే, మృనాల్ ఠాకూర్, అయేషా ఖాన్ నటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజం అయ్యి ఈ ముగ్గురు పెద్ది ఐటమ్ సాంగ్‌లో కనిపించినట్లయితే ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ ఐటెం నెంబర్ అయ్యే అవకాశాలున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈయన ఇప్పటికే ఈ చిత్రంలోని ఐటమ్ పాటను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వికపూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా... శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






