- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"పెద్ది" మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే !
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Global star Ram Charan ) ప్రస్తుతం చేస్తున్న సినిమా పెద్ది (Peddi ). ఈ సినిమా షూటింగ్ దశలో ఉం

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Global star Ram Charan ) ప్రస్తుతం చేస్తున్న సినిమా పెద్ది (Peddi ). ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు. మరో రెండు రోజుల్లో.. ఈ సినిమా నుంచి తుఫాను లాంటి అప్డేట్... వస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. రెండు రోజుల్లో ఫస్ట్ షూట్ ( PeddiFirstShot ) అంటూ ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. అంతేకాదు రామ్ చరణ్ ( Ram Charan ) మాస్ లుక్ పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం.
ఇందులో ఓ బీడీ కాల్చుతూ.. ఉగ్ర రూపం తో రామ్ చరణ్ చూస్తున్నాడు. అయితే రెండు రోజుల్లో ఫస్ట్ షూట్ అంటే... షూటింగ్ కు సంబంధించిన వీడియో విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఏప్రిల్ ఆరో తేదీన సాయంత్రం ఈ అప్డేట్ రిలీజ్ చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు ( Bucchi babu) దర్శకత్వంలో పెద్ది సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబుతో పాటు శివరాజ్ కుమార్ ( Dr Shiva Rajkumar) కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.






