కన్నీళ్లు తెప్పిస్తున్న పాయల్ పోస్ట్.. హార్ట్ బ్రేకింగ్ సింబల్‌తో ఎమోషనల్..

by Kavitha |
కన్నీళ్లు తెప్పిస్తున్న పాయల్ పోస్ట్.. హార్ట్ బ్రేకింగ్ సింబల్‌తో ఎమోషనల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్ గురించి మనందరికీ తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కిన ఈ మూవీలో పాయల్ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. తొలి చిత్రంలోనే ఈ అమ్మడు ఆ రేంజ్‌లో అందాలు ఆరబోయడం, రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోవడంతో కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వెంకటేష్(Venkatesh) సరసన ‘వెంకీ మామ’(venky Mama) సినిమాలో కథానాయికగా నటించింది. 2023లో వచ్చిన ‘మంగళవారం’(Mangalavaram) అనే చిత్రంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఓ భారతీయ పౌరుడు హాయిగా నిద్రపోతున్నాడంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ.. అతను మనందరికీ బాడీ గార్డ్ లాగా ఉండటం వల్లనే అనే విధంగా ఓ ఫొటో పెట్టింది. ఆ పిక్‌లో జవాన్ వెనక నుంచి బాంబులు, బుల్లేట్స్, కత్తులు అన్ని అతన్ని చంపడానికి ట్రై చేస్తున్నా.. తన రెండు చేతులను మనకు అడ్డుగా ఉంచి మనం హాయిగా నిద్రపోయేలా చేస్తున్నాడనేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో చూస్తే కన్నీళ్లు రాక మానడం లేదు. కాగా ప్రెజెంట్ భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే.




Next Story