Pawan Kalyan: యాక్షన్ లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. సెట్‌లో పవన్ కల్యాణ్!

by Chukka Sudharani |   (  Updated:2025-06-10 11:25:23  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం.. పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Pawan Kalyan: యాక్షన్ లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. సెట్‌లో పవన్ కల్యాణ్!
X

దిశ, సినిమా: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం.. పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు తన ఫోకస్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పెట్టినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల (Sree leela) హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూట్ మొదలైంది.. నేటి నుండి హైదరాబాద్‌లో కొన్ని రోజులు షెడ్యూల్ జరగనుంది. ఈ షూటింగ్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుండగా.. ఈ షూటింగ్‌లో పవన్ కల్యాణ్‌తో పాటు శ్రీలీల కూడా జాయిన్ అయ్యారట’ అంటూ దర్శనమిచ్చిన పోస్ట్‌లో పవన్ కల్యాణ్ కారులో సెట్‌కి వచ్చినట్లు వీడియో వైరల్‌గా మారింది.

Next Story