పవన్‌ కల్యాణ్‌ ‘OG’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-26 05:59:04  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం OG. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ‘OG’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం OG. దీనిని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. పవన్ డేట్స్ ఇవ్వడంతో ప్రస్తుతం షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే.. చాలా ఏళ్ల తర్వాత పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కాగా, మరోవైపు, కొన్ని రోజుల క్రితమే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రీకరణ పూర్తయింది. వచ్చే జూన్ 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇది విడుదలైన మూడు నెలలకే ఓజీ వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. దీని తర్వాత వచ్చే ఏడాది సమ్మర్‌లో హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్‌ను విడుదల చేసేలా చిత్రీకరణ జరుగుతోంది.

Next Story