రికార్డులు తిరగరాస్తున్న పవన్ కల్యాణ్ ‘OG’.. తొలిసారి ఆ క్లబ్‌లోకి ఎంట్రీ ఖాయమా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-30 10:45:32  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రం(OG Movie) రికార్డులు తిరగరాస్తోంది.

రికార్డులు తిరగరాస్తున్న పవన్ కల్యాణ్ ‘OG’.. తొలిసారి ఆ క్లబ్‌లోకి ఎంట్రీ ఖాయమా?
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రం(OG Movie) రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీకి అత్యంత వేగంగా ఐదు ల‌క్షల డాల‌ర్ల (సుమారు రూ. 4.15 కోట్లు)కు పైగా ప్రీమియ‌ర్స్ ప్రీ సేల్స్ జ‌రిగిన‌ట్లు మేక‌ర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రక‌టించారు. దీనికి ‘క్షణ‌క్షణ‌మొక త‌ల తెగి ప‌డెలే’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ మూవీ సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు కాబోతోంది. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న ప్రియాంక మోహన్(Priyanka Mohan) నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్ర‌తినాయ‌కుడిగా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, నారా రోహిత్‌కు కాబోయే భార్య సిరి లేళ్ల కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి మొత్తం రూ.200 కోట్ల వరకు బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. హిట్ టాక్ వస్తే వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడం పక్కా అంటున్నారు. ఈ దెబ్బతో పవన్ కల్యాణ్ తొలిసారి రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయమని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

Next Story