అక్కడ ఒకరోజు ముందే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విడుదల!

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-19 15:27:56  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా హరిహర వీరమల్లు(Harihara Veeramallu) తెరకెక్కుతోంది.

అక్కడ ఒకరోజు ముందే పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విడుదల!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా హరిహర వీరమల్లు(Harihara Veeramallu) తెరకెక్కుతోంది. క్రిష్ జాగర్లమూడి-జ్యోతికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, నాజర్ వంటి సీరియన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తోంది. జూన్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరోజు ముందే అమెరికా సహా ఇతర దేశాల్లో ప్రీమియర్స్ వేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లు నెట్టింట పోస్టు చేస్తున్నారు. దీంతో విదేశాల్లో స్థిరపడిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story