Pawan Kalyan: రంగం సిద్ధం.. రౌడీ హీరోకు బిగ్ షాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..!

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Pawan Kalyan: రంగం సిద్ధం.. రౌడీ హీరోకు బిగ్ షాక్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్..!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేస్తున్నారు. ఇందులో హరిహర వీరమల్లు(Harihara Veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్,ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే కొంతశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలు సగంలో ఆగిపోయాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి పవన్ వాటిని పూర్తి చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. వాయిదా పడకుండా అనుకున్న సమయానికే అవి థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్(Nidhi Agarwal), అర్జున్ రాంపాల్, బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రం వచ్చే నెల 30వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్. అదే సమయానికి విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇంకా మూడు, నాలుగు రోజుల్లో ‘హరిహర వీరమల్లు’ షూట్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అది పక్కాగా వస్తే కింగ్ డమ్ వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ లేదా త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తే కానీ గందరగోళం నుంచి అభిమానులు బటయపడేలా లేరు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన వారు విజయ్‌కి షాకి ఇవ్వబోతున్నాడన్న మాట.. భారీ అంచనాల మధ్య రాబోతున్న కింగ్‌డమ్ వాయిదా పడితే.. డిజాస్టర్ అవుతుందనే చర్య మొదలైంది.

Next Story