- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్.. చిందేసిన పవన్ కల్యాణ్ (వీడియో)
‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్.. చిందేసిన పవన్ కల్యాణ్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: ఓజీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan).. నెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా(Ustad Bhagat Singh Movie)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) దీనిని తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, రాశీకన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పోర్షన్‌ను పూర్తి చేయగా.. మిగిలిన భాగాల షూటింగ్‌ను ప్రస్తుతం హరీశ్ శంకర్ చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో తొలి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ కనిపించారు. దీంతో ఎన్నాళ్లు అయింది అన్న నిన్ను ఇలా చూసి అని కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పవన్ ఫస్ట్ లుక్, టీజర్స్‌కి ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






