Aura Of Ustaad: మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే..

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది.

Aura Of Ustaad: మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ (Aura Of Ustaad) పేరిట హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ వేదికగా ఆదివారం రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) మేనరిజానికి ఈ పాట ద్వారా డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే’.. అని నిర్వచనం ఇచ్చారు. ప్రేక్షకుల్లో పవన్ కల్యాణ్‌కున్న క్రేజ్‌ను ప్రతిబింబించేలా చంద్రబోస్‌ రాసిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌, ఎస్పీ అభిషేక్‌ పాడారు. సంగీతం కూడా దేవిశ్రీ ప్రసాదే అందించారు. మార్చి 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. శ్రీలీల, రాశీఖన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. తమిళ నటులు పార్థిబన్, కెయస్ రవికుమార్ కీలక పాత్రల్లో మెరిశారు. ఎల్బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.


Next Story