- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. ఓజీ షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్
పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్.. ఓజీ షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజి’(OG) కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్(Sujith) తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్(DVV Entertainments) బ్యానర్ పై దానయ్య(Danaiah) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీటీమ్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. #OG అతని రంగంలోకి అడుగుపెట్టాడు.. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ ఆన్ ఓజి సెట్స్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఈ సీన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.






