‘దురదృష్టవశాత్తూ ఆధునిక జీవనం.. ప్రకృతి నుంచి మనల్ని దూరం చేసింది’: renu desai

by Kodari Anjali |   (  Updated:2025-06-13 15:59:58  IST  )

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘దురదృష్టవశాత్తూ ఆధునిక జీవనం.. ప్రకృతి నుంచి మనల్ని దూరం చేసింది’: renu desai
X

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె పార్థిబన్ హీరోగా వచ్చిన జేమ్స్ పాండు రంగం అనే తమిళ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అదే ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి చిత్రంలో అవకాశం కొట్టేసి.. పవన్ కల్యాణ్ సరసన నటించే చాన్స్ దక్కించుకుంది. ఇక చిత్ర షూటింగ్ సమయంలోనే రేణు దేశాయ్, పవన్ కల్యాన్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత వీరిద్దరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

వివాహనంతరం రేణు దేశాయ్ సినిమాలకు గుడ్ బై చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరావు చిత్రంలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక బద్రి, జానీ సినిమాల్లోనే నటించినప్పటికీ.. ఖుషి, జానీ, గుడుంబా శంకర్ (Gudumba Shankar), బాలు, అన్నవరం, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ అకీరా నందర్, ఆద్యల్ని చదివిస్తూ.. వారి బాగోగులు చూసుకుంటూ ఉత్తమ తల్లిగా పేరు సంపాదించుకుంటుంది.

మరికొద్ది రోజుల్లో కొడుకు అకీరా నందర్ సినిమాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తుంది. మరీ ఎంతవరకు వాస్తవమో వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే రేణు దేశాయ్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్ ఉంటుంది. తాజాగా ఈ నటితాజాగా ఈ హీరోయిన్ ‘‘ఇదంతా ఈరోజు సాయంత్రం జరిగింది కానీ రివర్స్ ఆర్డర్‌లో.. ప్రతి సీజన్‌ను అనుభవించాల్సిందే అని నేను నమ్ముతున్నాను. చలికాలంలో చలిని అనుభవించండి. వర్షాకాలంలో తడిసిపోండి. మన వేసవి వేడిని అనుభవించండి. దురదృష్టవశాత్తూ ఆధునిక జీవనం ప్రకృతి నుండి మనల్ని దూరం చేసింది’’ అంటూ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుని రాసుకొచ్చింది.

Next Story