- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ‘పరాశక్తి’ టీమ్.. అసలేం జరిగిందంటే..
శివ కార్తికేయన్, రవి మోహన్, అథర్వా, శ్రీలీల ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రెజెంట్ సెన్సార్

దిశ, సినిమా : శివ కార్తికేయన్, రవి మోహన్, అథర్వా, శ్రీలీల ప్రధానపాత్రల్లో కనిపించబోతున్న సినిమా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ డ్రామాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. అయితే ప్రెజెంట్ సెన్సార్ బోర్డు (CBFC)తో సమస్య ఏర్పడింది. సినిమాను చూసిన CBFC ఎగ్జామినింగ్ కమిటీ భారీ కట్స్ సూచించింది. ముఖ్యంగా 1960ల చివర్లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం (anti-Hindi agitations) సంబంధిత సీన్స్, డైలాగ్స్‌లో భారీగా మార్పులు చేయాలని చెప్పింది. కానీ ఈ కట్స్‌తో సినిమా చారిత్రక సందేశం మారిపోతుందని భావించిన నిర్మాతలు సెన్సార్ బోర్డు సూచనలను వ్యతిరేకిస్తూ.. రివైజింగ్ కమిటీ (RC)కి అప్పీల్ చేశారు. అయితే ఇప్పటివరకు నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ఈ విషయంపై స్పష్టమైన స్టేట్‌మెంట్ రాలేదు. RC నిర్ణయం సమయానికి వస్తుందా? లేక డిలే అవుతుందా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కాగా సోషల్ మీడియాలో, తమిళ సినిమా వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చాలామంది చారిత్రక సత్యాన్ని కాపాడాలని, భాషా రాజకీయాల సున్నితత్వంపై చర్చించే సినిమాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






