ఆ విషయంలో బాలీవుడ్ విఫలమైంది.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్ సిరీస్‌తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఆ విషయంలో బాలీవుడ్ విఫలమైంది.. ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ‘మీర్జాపూర్’ (Mirzapur) వెబ్ సిరీస్‌తో అన్ని భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇందులో కలీన్ భయ్యాగా నటించగా.. ఆయన పాత్రకు, యాక్టింగ్‌ను నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘90ల్లో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సినిమాలు రూపొందించేవారు. వాటికి ఆడియన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యేవారు. ఆ మ్యాజిక్ ఇప్పటి కథల్లో లేదు. ఏదో ఎంజాయ్‌మెంట్ కోసం సినిమాలు చూస్తున్నారు కానీ... పాత్రలకు, కథకు కనెక్ట్ కావడం లేదు. కథలో బలం ఉంటే ఆ సినిమా ఎన్నిసార్లు రిలీజ్ చేసిన మంచి సక్సెస్ అందుకుంటోంది. నేను నటించిన ‘బరేలీ కీ బర్ఫీ’ చిత్రం ఇటీవల కూడా రీరిలీజై మరోసారి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం లేదు. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోయే కథలను తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైంది’ అని చెప్పుకొచ్చారు.

Next Story