- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jatadhara: ‘పల్లో లట్కే’ రాబోతున్నది.. కెమిస్ట్రీకి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతోన్న ‘జటాధర’ మూవీ అప్డేట్స్‌లో వేగం పెంచింది.

దిశ, సినిమా: జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతోన్న ‘జటాధర’ మూవీ అప్డేట్స్‌లో వేగం పెంచింది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘ఓం నమః శివాయ’ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘పల్లోలట్కే’ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘అక్టోబర్ 10న సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్న ‘పల్లో లాట్కే’ మీ ముందుకు రాబోతున్నది. ఇందులో సుధీర్ బాబు & శ్రేయ శర్మ తమ హై-ఎనర్జీ మూవ్స్ అండ్ కెమిస్ట్రీతో అబ్బురపరచనున్నారు. సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు, వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూవీ ‘జటాధర’. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా కాగా.. ఈ ఏడాది నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. liNk






