మలయాళంలో రిలీజై తెలుగులో వాయిదా పడిన పళ్లి చట్టంబి.. ఎందుకంటే?

by Chukka Sudharani |

కొన్ని సాంకేతిక కారణాల చేత తెలుగులో విడుదల వాయిదా పడిన పళ్లి చట్టంబి.

మలయాళంలో రిలీజై తెలుగులో వాయిదా పడిన పళ్లి చట్టంబి.. ఎందుకంటే?
X

దిశ, సినిమా: డిఫరెంట్ కంటెంట్స్‌తో ప్రేక్షకుల మనసుల దోచుకుంటున్న మలయాళ హీరో టొవినో థామస్నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పళ్లి చట్టంబి’. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 15న రిలీజ్‌కు రావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే మలయాళంలో ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కాగా.. తెలుగులో మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా వేసి ఈ నెల 17కు పోస్ట్ పోన్ చేశారు. ఈ చిత్రాన్ని బన్ని వాస్ వర్క్స్ పతాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 1950- 60 ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి వచ్చిన తెలుగు ట్రైలర్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Next Story