Dhurandhar 2: రూ.500కోట్లు ఇవ్వండి..పాకిస్థానీల డిమాండ్

by velandi.Saikiran |

పాకిస్తానీల నుంచి ఆసక్తికర డిమాండ్ తెరపైకి వచ్చింది.ధురంధర్ 2 సినిమా కలెక్షన్స్ లో తమకు కొంత షేర్ ఇవ్వాలని కోరుతున్నారు.

dhurandhar 2
X

dhurandhar 2 

దిశ‌, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ధురంధర్ 2 సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. కలెక్షన్స్ లో దూసుకు వెళ్తోంది. అయితే బాక్సాఫీస్ వసూళ్లలో ధురంధర్ 2 సినిమా దూసుకు వెళ్తున్న నేపథ్యంలో పాకిస్తానీల నుంచి ఆసక్తికర డిమాండ్ తెరపైకి వచ్చింది. ధురంధర్ 2 సినిమా కలెక్షన్స్ లో తమకు కొంత షేర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు దర్శకుడు ఆదిత్యధర్ ను డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

లాభాల్లో 70 నుంచి 80 శాతం షేర్ లేదా రూ. 500 కోట్లు అయినా ఈ సినిమా కలెక్షన్లలో ఇవ్వాలని పాకిస్తాన్లు కోరుతున్నారు. త‌మ పాకిస్తాన్ ప్రాంతంపైన సినిమా తీసినందుకు ఈ మొత్తాన్ని ఇవ్వాలని ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఇచ్చే డబ్బులతో పాకిస్తాన్ దేశంలోని రోడ్లు రిపేర్, తాగునీటి లాంటి అభివృద్ధి పనులు చేపడుతామని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా ధురంధర్ 2 సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం.

Next Story