- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIGG BOSS 19: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గామ్ మృతుడి భార్య?
బిగ్ బాస్ 19 షో ప్రీమియర్స్ కోసం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇలాంటి సమయంలో ఓ

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ 19 షో ప్రీమియర్స్ కోసం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. బిగ్ బాస్ 19లోకి ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వ్యక్తి భార్య హిమాన్షి నర్వాల్ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సీజన్‌లో ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే కొంతమందిని తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిమాన్షి నర్వాల్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట.
అయితే బిగ్ బాస్ టీమ్ ఇప్పటి వరకు ఆమెతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. అంతే కాకుండా ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ కూడా జరగలేదు. హిమాన్షి నర్వాల్ బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు ఒకప్పుడు కాలేజీలో స్నేహితురాలు. ఈ కారణంతోనే హిమాన్షి నర్వాల్ పేరు బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఘటన దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. కాగా హిమాన్షి నర్వాల్ తన భర్తతో కలిసి హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లింది. తన భర్తను ఉగ్రవాదులు హతమార్చగా మృతదేహం వద్ద ఆమె రోదిస్తున్న సన్నివేశం ప్రపంచాన్నే కదిలించింది. కాబట్టి ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే దేశం మొత్తం ఆసక్తికరంగా చూసే అవకాశం ఉంది.






