వేతనాల పెంపుకు ఒకే కానీ షరతులు వర్తిస్తాయి : దిల్ రాజు

by Muthe.Rajitha |   (  Updated:2025-08-13 14:58:44  IST  )

30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికుల ఫెడరేషన్ చేస్తున్న సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది.

వేతనాల పెంపుకు ఒకే కానీ షరతులు వర్తిస్తాయి : దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్ : 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికుల ఫెడరేషన్ చేస్తున్న సమ్మె రోజుకో మలుపు తిరుగుతోంది. నేడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కార్మికుల ఫెడరేషన్, సినీ నిర్మాతలు చర్చలు జరిపారు. చర్చల అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ఫెడరేషన్, నిర్మాతల మధ్య జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని పేర్కొన్నారు. కార్మికులకు వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారని, అయితే కొన్ని షరతులు విధిస్తున్నారని తెలిపారు. 2018, 2022 జరిగిన అగ్రిమెంట్స్ లోని కొన్ని నిబంధనలు కార్మికులు పాటించడం లేదని ముందుగా వాటిని ఒప్పుకోవాలని చెప్పినట్టు వెల్లడించారు.

అలాగే ఒకరోజుకు రూ.2 వేల కంటే తక్కువ వేతనాలు పొందుతున్న వారికి ఒక రకమైన పర్సంటేజ్, అంతకు మించి వేతనాలు ఉన్నవారికి మరొక రకమైన పర్సంటేజ్ ఇచ్చేందుకు మాత్రమే నిర్మాతలు ముందుకు వస్తున్నారని అన్నారు. ఫెడరేషన్ లోని అన్ని యూనియన్లు ఈ విషయాలపై ఒకతాటికి వచ్చి మరోసారి చర్చలకు రావాలని సూచించినట్టు దిల్ రాజు తెలిపారు.

Next Story