- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెజెండ్స్ భయపడే పనిని పిచ్చివాడు మాత్రమే చేయగలడు.. ఆకస్తికరంగా టాక్సిక్ డైరెక్టర్ ట్వీట్
రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘లెజెండ్స్ భయపడే పనిని పిచ్చివాడు మాత్రమే చేయగలడు. టీజ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలకు చేరుకుంది. 19-03-2026న టాక్సిక్ మూవీ ప్రపంచాన్ని మత్తులో ముంచెత్తుతోంది’ అంటూ రాసుకొచ్చారు.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. యష్ గన్ పట్టుకొని క్యాప్ అండ్ స్టైలీష్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ సినిమాలో రాయగా యష్, నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, మెల్లిసాగా రుక్మిణీ వసంత్ నటించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.






