‘OG నామస్మరణ’.. దద్దరిల్లనున్న LB స్టేడియం

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ఓజీ చిత్రబృందం(OG Movie) శుభవార్త చెప్పింది.

‘OG నామస్మరణ’.. దద్దరిల్లనున్న LB స్టేడియం
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానులకు ఓజీ చిత్రబృందం(OG Movie) శుభవార్త చెప్పింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సినిమా మ్యూజిక్ కన్సర్ట్(OG Cinema Music Concert) నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రేపు ఎల్బీ స్టేడియం మైదానం దద్దరిల్లిపోనుందనే క్యాప్షన్ ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ ఈ మూవీలో పవర్‌పుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పైగా ఆయన డ్యుయెల్ రోల్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈనెల 25న రిలీజ్ కానున్నది. ట్వీట్

Next Story