- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ బస్టర్ హిట్ సయారా సీక్వెల్‌పై అఫీషియల్ అప్డేట్.. పోస్ట్ వైరల్
రీసెంట్ టైంలో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో ‘సయారా’ ఒకటి.

దిశ, సినిమా: రీసెంట్ టైంలో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో ‘సయారా’ ఒకటి. యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం చిన్న అంచనాలను మించి ఆశ్చర్యపరిచి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన సొంతం చేసుకుంది. ఆషికి-2, మలంగ్, ఏక్ విలన్ వంటి ప్రేమ కథా చిత్రాల్ని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందించింది. అనీత్ పద్దా, అహాన్ పాండే జంటగా నటించిన ఈ చిత్రం యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుండని అంతా భావించారు. అయితే తాజా సమాచారం మేరకు యూత్‌కు ఓ గుడ్ న్యూస్ అందిందనే చెప్పొచ్చు. తాజాగా సయారా బృందం మరోసారి మీట్ అయ్యారు. ఈ మేరకు, దర్శకుడు మోహిత్ సూరి, నిర్మాత అక్షయ్ విధాని, ప్రధాన నటీనటులు అనీత్ పద్దా, అహాన్ పాండే ఒక సరికొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ఇది మనసును హత్తుకునే సంగీతంతో కూడిన ఒక భావోద్వేగ ప్రేమకథ అని తెలుస్తుండగా.. YRF నిర్మాణంలో రూపొందుతోంది. అయితే.. సయారా సీక్వెల్‌గా వస్తున్న దీనికి ఇంకా టైటిల్ కరారు కాలేదు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






