O Bhama Ayyo Rama: క్యూట్‌ అండ్‌ లవ్‌లీ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటోన్న టైటిల్ సాంగ్..

by Chukka Sudharani |

తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్‌ (Suhas) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్‌ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’

O Bhama Ayyo Rama: క్యూట్‌ అండ్‌ లవ్‌లీ లవ్‌స్టోరీగా ఆకట్టుకుంటోన్న టైటిల్ సాంగ్..
X

దిశ, సినిమా: తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్‌ (Suhas) నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్‌ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama). రామ్ గోధల (Ram Godhala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో మలయాళం(Malayalam)లో ‘జో’ చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (Malavika Manoj) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్న ఈ మూవీని హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. వేసవిలో ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. తాజాగా సినిమా టైటిల్‌ సాంగ్‌ (Title song) లిరికల్‌ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. పాటను గమనిస్తే.. ఈ సినిమా క్యూట్‌ & లవ్‌లీ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీలా అర్థం అవుతోంది. పాటలోని ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఆకట్టుకోగా.. సుహాస్‌, మాళవిక ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అలాగే హీరో, హీరోయిన్‌ డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌ కూడా అలరించే విధంగా ఉన్నాయి. టోటల్‌గా వినగానే అందరికి నచ్చే యూత్‌ఫుల్‌ సాంగ్‌‌గా ‘ఓ భామ అయ్యో రామ’ టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

సాంగ్ లాంచ్ సందర్భంగా డైరెక్టర్ రామ్‌ గోదాల మాట్లాడుతూ.. ‘రథన్‌ ఈ లవ్‌స్టోరీ(love story)కి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు విడుదల చేసిన ఈ పాట ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. పాటలోని సాహిత్యం, హీరో, హీరోయిన్‌ ఎనర్జీ, రథన్‌ సంగీతం పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకులకు కూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. సినిమాలోని ప్రతి పాత్ర ఎంతో బాగుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల తరువాత ఓ మంచి సినిమాను చూశామనే అనుభూతికి లోనవుతారు అన్నారు.

Next Story