- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NTRNeel: గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్.. మేకర్స్ అధికారిక ప్రకటన
NTRNeel మూవీ గ్లింప్స్‌ను మే 19వ తేదీ రాత్రి 11:52 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ప్రస్తుతం "NTRNeel" అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ గ్లింప్స్ విడుదల సమయాన్ని కూడా అధికారికంగా వెల్లడించారు. మే 19వ తేదీ రాత్రి 11:52 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ గ్లింప్స్ వీడియో ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనుండటం విశేషం. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.






