- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మృతి తరహాలో పెళ్లి రద్దు చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ ?
రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇద్దరు క్లోజ్ గా ది

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళల జట్టుకు చెందిన స్మృతి మందాన పెళ్లి ఇటీవల రద్దయిన సంగతి తెలిసిందే. పలాష్ ముచ్చల్ అసలు చీకటి వ్యవహారం బయటపడడంతో తన పెళ్లిని చాలా తెలివిగా స్మృతి మందాన రద్దు చేసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే స్మృతి మందాన తరహాలోనే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి కూడా రద్దయినట్లు సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు విశ్వక్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే నివేదా పేతురాజ్ ( Nivetha Pethuraj ).
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇద్దరు క్లోజ్ గా దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. డిసెంబర్ లోగా పెళ్లి జరుగుతుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఈ జంట గురించి ఇప్పుడు షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
నివేదా, రాజ్ హిత్ ఇబ్రాన్ వివాహం రద్దయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలను నివేదా తొలగించారట. ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారట. దీంతో వీళ్ళ వివాహం రద్దయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త వైరల్ అవుతోంది.






