భర్తతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నితిన్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్

by I. Sairam |

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) సరసన "లై(Lie) అనే తెలుగు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన మేఘా ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భర్తతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నితిన్ హీరోయిన్.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) సరసన "లై(Lie) అనే తెలుగు చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన మేఘా ఆకాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం విజయం సాధించకపోయినా, ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అలా SIIMA అవార్డు ఉత్తమ తొలి నటిగా నామినేషన్ అందుకుంది. ఆ తర్వాత "ఛల్ మోహన్ రంగ", "రాజ రాజ చోర", "డియర్ మేఘా" వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మేఘా సాయి విష్ణు(Sai Vishnu)ను సెప్టెంబర్ 15, 2024న చెన్నైలో వివాహం చేసుకుంది.

ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో మేఘా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో తన భర్తతో సమ్మర్ వేకెషన్స్ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేస్తూ.. ‘సమ్మర్ మూడ్ ఛేసింగ్ సన్‌సైన్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు క్యూట కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story