- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈసారి ‘అక్కాయిలు బాగున్నారా’!..
ఈ ఏడాది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేక పోయాడు.

దిశ, సినిమా: ఈ ఏడాది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేక పోయాడు. దీంతో రవితేజ నెక్ట్స్ ఎలాంటి మూవీతో వస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మాస్ హీరో నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన ‘భద్ర’, ‘రాజా ది గ్రేట్’ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలను నిర్మించిన దిల్ రాజుతో రవితేజ తన తదుపరి ప్రాజెక్టు కోసం చేతులు కలిపాడట.
ఈ కలయికలో వస్తున్న మూవీకీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ హాసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే దిల్ రాజు, రవితేజకు హాసిత్ గోలి కథ చెప్పగా వారికి బాగా నచ్చి ఓకే చేశారట. అంతే కాకుండా.. ఈ మూవీకి ‘అక్కాయిలు బాగున్నారా!’ అనే టైటిల్ ఖారారు చేశారట. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుంటే.. టైటిల్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






