- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirai: సూపర్ యోధ అంటూ మిరాయి నుంచి న్యూ పోస్టర్ రిలీజ్..
‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja).

దిశ, సినిమా: ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja).. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో ‘మిరాయ్’ (Mirai) ఒకటి. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టిజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తు్న్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా న్యూ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘గత సంక్రాంతి నుండి నా ప్రయాణం ఎగురుతూ ప్రారంభమైంది.. ఇంకా మీ ప్రేమతో అది కొనసాగుతోంది.. లేగండి.. లేచి ఆకాశంలో గాలిపటాల్లా ఎగురుదాం!.. మా సూపర్ యోధా లాగానే గాలిపటంలా ఎగరండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన పోస్టర్‌లో.. తేజ గాలిలో ఎగురుతూ కనిపిస్తాడు. సూపర్ హీరో (Super hero) రేంజ్‌లో ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా.. రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Started flying since last Sankranthi, and it’s still continuing with your love🤗
— Teja Sajja (@tejasajja123) January 15, 2025
Wishing you all a vibrant Makara Sankranti ❤️
Let’s rise & fly like kites in the sky!#Mirai #HappySankranti pic.twitter.com/ifw9X97sW9






