చాలుచాల్లెవమ్మ.. చెబుతే నమ్మేలా ఉండాలి.. నువ్వూ నీ ఏతులు.. అనసూయకు ఇచ్చిపడేసిన నెటిజన్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-07-28 12:17:22  IST  )

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజీని సొంతం చేసుకుంది.

చాలుచాల్లెవమ్మ.. చెబుతే నమ్మేలా ఉండాలి.. నువ్వూ నీ ఏతులు.. అనసూయకు ఇచ్చిపడేసిన నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజీని సొంతం చేసుకుంది. జబర్ధస్త్ కామెడీ షోతో మోస్ట్ పాపులర్‌గా మారిన అనసూయ.. రంగస్థలంలో రంగమ్మ అత్తగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత పుష్పతో పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ ద్రాక్షాయని.. నిత్యం అభిమానులకు టచ్ ఉంటూ తన అప్ డేట్స్ ఇస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అను.. ట్రోలర్స్‌కు గట్టిగానే సమాధానం ఇస్తుంది. తనపై అసభ్యకరంగా ఎవరైనా కామెంట్స్ చేస్తే తగ్గెదేలే అంటూ వారిపై విరుచుకుపడుతుంది.

అనసూయకు అస్సలు నచ్చని పదం ఆంటీ.. ఆంటీ అంటూ ఎవరైనా పిలిచినా.. కామెంట్స్ చేసినా రచ్చరచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ట్రోల్ చేసే 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను బ్లాక్ చేశానని చెప్పుకొచ్చింది. అడ్డమైన కామెంట్స్ పెడితే నేను ఏమాత్రం తగ్గనని పేర్కొంది. అయితే ఈ కామెంట్సే మళ్లీ అనసూయను ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి. అనసూయ ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు 16 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారని, కానీ ఆమె మూడు మిలియన్ల మందిని ఎలా బ్లాక్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. చెబితే నమ్మాలని.. ఏతులు ఎందుకు చెబుతున్నావని ట్రోల్ చేస్తున్నారు. కామెంట్ చేసే ముందు నీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ కామెంట్స్‌పై ఈ ఐటెమ్ ‘అను’బాంబ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story